తెలంగాణలో వింత వైరస్..
తెలంగాణలో వింత వైరస్ సోకి, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతు చిక్కని ఈ వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో ఫౌల్ట్రీ ఫామ్‌లలో భారీ నష్టం జరుగుతోంది. సత్తు పల్లి, కల్లూరు, కిష్ణాపూర్, భీంగల్ గ్రామాలలోని రైతులు దీనితో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు రోగం సోకిన కోళ్ల నుండి శాంపిల్స్ తీసి, ల్యాబ్‌కు పంపించారు. ఏపీలో కూడా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. వైద్యులు రోగ నిర్ధారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.