Home Page SliderNational

వింత ఆచారం.. వింత మొక్కులు చూశారా..?

తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన వారు తలనీలాలు సమర్పించుకుంటారు. అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలాగే తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఒట్టన ఛత్రం సమీపంలో ఉన్న వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ ఆలయంలో ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఇక్కడ భక్తులు తలపై కొబ్బరికాయ పగలగొట్టి కాస్త ప్రమాదకరంగా మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ పగలగొడతారు. తాజాగా జరిగిన వేడుక వీడియో వైరలవుతోంది.