Home Page SliderNational

ఆర్టీసీ బస్సులో విచిత్ర ఘటన..

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. అని బస్సులపై రాసి ఉండటం చూసే ఉంటాం. ఇది నిజమే కానీ అక్కడక్కడా జరిగే కొన్ని ఘటనలు ప్రభుత్వ వ్యవస్థలపై అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. తమిళనాడులో ఓ బస్సు ను ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు. ఒకరు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని స్టీరింగ్ ను కంట్రోల్ చేస్తుండగా.. మరొకరు గేర్ బాక్స్ పక్కన కూర్చొని… డ్రైవర్ చెప్పినప్పుడల్లా గేర్లు మారుస్తున్నారు. గేర్ రాడ్ లేకపోవడంతో స్పీడును బట్టి కండక్టరే గేర్ మారుస్తున్నట్లు కనిపిస్తుంది. అదే బస్సులో ప్రయా ణిస్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఆర్టీసీపై ప్రభుత్వాలు చూపి స్తున్న శ్రద్ధపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా? అంటూ మండిపడుతున్నారు.