సృష్టిలో విచిత్రం.. ఈ వ్రేలాడే చెట్టు
హర్యానాలోని ఈ చెట్టు సృష్టిలోనే విచిత్రంగా పేరు పొందింది. దీనిని దేవతా వృక్షంగా భావిస్తారు స్థానికులు. ఈ చెట్టు చుట్టూ దారాలు కట్టి పూజిస్తున్నారు. ఇది నేలకు ఉండకుండా వేళ్లతో సహా గాలిలో వ్రేలాడుతున్నట్లు ఉంటుంది. ఈ చెట్టు ఇలా ఉండడానికి గల రహస్యం ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ చెట్టుపై రకరకాల పరిశోధనలు చేస్తున్నారు.