Home Page SliderInternational

తుఫాన్ భీభత్సం.. 32 మంది మృతి

అమెరికాలో భయంకరమైన తుఫానులతో 32 మంది మృత్యువాతపడ్డారు. కాన్సాస్‌లో ధూళి కారణంగా రోడ్లు కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది, అర్కన్సాస్‌లో ముగ్గురు మరణించారు. బలమైన గాలులకు వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.గత రెండు రోజులుగా యూఎస్ లో భయంకరమైన గాలులు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. సెంట్రల్ అమెరికాలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో 2 లక్షల ఇండ్లు, ఆఫీసులు చీకట్లో మగ్గిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు.