నిలిచిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులకు అవస్థలు..
హైదరాబాద్ మహా నగరంలో పరుగులు పెట్టే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా సోమవారం ఉదయం రైళ్లు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 నిమిషాలుగా మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు ఈ పరిణామంతో అవస్థలు పడ్డారు. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్ – మియాపూర్ రూట్లలో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.