తెలంగాణాపై విషం చిమ్మడం ఆపండి: బీఆర్‌ఎస్ మంత్రి
ఏపీ విద్యాశాఖ మంత్రి తెలంగాణా విద్యా విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు మంత్రి బొత్స విజయవాడలో ట్రిపుల్ ఐటీ ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణాతో పోల్చి చూడటం సరికాదన్నారు. ఎందుకంటే తెలంగాణాలో నిత్యం చూచిరాతలు, కుంభకోణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా తెలంగాణా రాష్ట్రానికి టీచర్లను కూడా బదిలీ చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఏపీలో “మన విధానం మనది, మన ఆలోచనలు మనవి” అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తెలంగాణా మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యున్నతమైన విద్యను అందిస్తుందన్నారు. కాగా ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఏపీ మంత్రులు తెలంగాణాపై విషం చిమ్ముతూనే ఉన్నారని మంత్రి గంగుల మండిపడ్డారు. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో గురుకులాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వంతో ఏపీకి అవసరం లేదన్నారు. తెలంగాణాది ఉద్యమాల చరిత్ర అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.