ఈవీఎంలపై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు
నేడు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలపై జరుగుతున్న అసత్య ప్రచారంపై మండిపడ్డారు. ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయనేది ఖండించవలసిన విషయమని సుప్రీంకోర్టే వెల్లడించిందని, ఏ రకంగానూ ఈవీఎంలు చాలా హ్యాక్ చేయడానికి గానీ, తారుమారు చేయడానికి గానీ, డేటా మార్చడానికి గానీ కుదరదని తేల్చి చెప్పారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమని, ఇలాంటి ప్రచారాల వల్ల ప్రజలలో భ్రమలు కలుగజేయవద్దని పేర్కొన్నారు.

