N కన్వెషన్ కూల్చివేత ఆపండి : హైకోర్టు
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నాగార్జున పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్వెషన్ పట్టా భూమి.. అది పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని వెల్లడించారు. ఇప్పుడు జరిగిన కూల్చివేతలు చట్ట విరుద్ధంగా.. లేదా.. తప్పుడు సమాచారంతో జరిగిందన్నారు. అందులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని.. పూర్తిగా ప్రైవేటు స్థలంలో నిర్మాణం జరిగిందని తెలిపారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.

