మంగళవారం కబుర్లు ఆపాలి…..
ఆడలేక మద్దెల దరువన్నట్లుంది ప్రభుత్వం తీరు అంటూ అధికారులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా జిల్లేడు బండ ప్రాజెక్టుని అంగుళం కూడా ముందుకు పోనివ్వబోమని గతంలోనే స్పష్టం చేశానని ,ఈ విషయం ఇవాళ కొత్తగా లేవనెత్తుతుంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే..తాను రైతుల తరుఫున నిష్పక్షపాతంగా మాట్లాడతానన్నారు.వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే 2023 ఆగస్టు నెలలో ఇదే వైఖరితో ఉన్నానని గుర్తు చేశారు. ధర్మవరం నియోజకవర్గం లో 25 వేల ఎకరాలు సస్యశ్యామలం చేసే జిల్లేడు ప్రాజెక్టు ను పూర్తి చేయడం మానేసి కుంటి సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు తీరాలంటే డ్యాములు, రిజర్వాయర్లు కట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు . జిల్లేడు బండ విస్తీర్ణం పోలవరం కన్నా ఎక్కువ ఉందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు లేవు కదా… మరి అమరావతికి ఎందుకు వేలాది ఎకరాలు తీసుకున్నారు చంద్రబాబు ఉంటూ కేతిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా మంగళవారం కబుర్లాపి పని చూడాలని వ్యగ్యంగా హితవు పలికారు.