Andhra PradeshHome Page Slider

పిన్నెళ్లి అరెస్టుపై భగ్గుమన్న వైఎస్ జగన్, శిశుపాలుడిలా పాపాలు పండుతాయ్!

పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి నిర్భందించారన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రమంతటా ఇలాగే చేస్తున్నారన్నారు. వైసీపీకి ఓటేయలేదని కేసులుపెడుతున్నారన్నారు. ఇష్టారాజ్యంగా కేసులతో వేధిస్తున్నారన్నారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఉండగా, జగనేం చేశాడని ప్రశ్నించారు. కులం, మతం చూడలేదని, ఏ పార్టీకి ఓటేశారని చూడకుండా ప్రతి పథకాన్ని అర్హులకు ఇచ్చారన్నారు జగన్. పథకాలను ఇళ్లకు డోర్ డెలివరీ ప్రభుత్వం చేసిందన్నారు. కానీ ఈవాళ టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. కొట్టడమే కాకుండా వారిపైనే ఉల్టా కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ విగ్రహాలను పగులగొడుతున్నారన్నారు. శిశుపాలుని పాపల్లా పాపాలు పండుతాయన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని, పలానా మంచి చేశామని చెప్పి ఓటేయాలని కోరాలని కానీ, అన్యాయంగా దౌర్జన్యం చేయడం తగదన్నారు. ఇది తాత్కాలికమేనన్నారు. ఓటేసేటప్పుడు ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారన్నారు. లెక్కా, జమా పెట్టుకొని ఓటేస్తారన్నారు. చంద్రబాబులో మార్పు రావాలన్నారు. ప్రజలు ఎందుకు ఓటేశారో ఆలోచించాలన్నారు.

వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, మంచి చేసి ఓడిందన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో పది శాతం ఓట్లు అటుపడ్డాయన్నారు. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రైతు భరోసా ఇవ్వలన్నారు. అమ్మ ఒడి కింద తాము 15 వేలిస్తే, చంద్రబాబు ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారన్నారు. కోటిమందికి పైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లేవారున్నారన్నారు. తల్లికివందనం డబ్బులు అడుగుతున్నారన్నారని ఆ పని చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలకు 1500 ఇవ్వాలని కోరారు. అలాంటి వాటిపై ధ్యాసపెట్టాలని, కేవలం భయాందోళనలు సృష్టిస్తుంచి వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దొంగ కేసులు పెట్టి ఆస్తుల ధ్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు, ఓటేసినవారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారని జగన్ మండిపడ్డారు.

పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు వైఎస్ జగన్. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెళ్లిని జగన్ పరామర్శించారు. కారంపూడి ఘటన ఎన్నికలైన తర్వాత జరిగిందని. టీడీపీ అకృత్యాలకు ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బందిపడితే డీఎస్పీ అనుమతి తీసుకొని వెళ్తే, అడ్డుకున్నారని, అక్కడే గొడవ జరిగిందన్నారు. చిన్న ఘటన మే 14న జరిగితే మే 23న సీఐ నారాయణ స్వామికి గాయమైందని హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సీన్లో లేని వ్యక్తితో కేసు పెట్టించారన్నారు. మే 13న జరిగిన మరో ఘటనపైనే హత్యాయత్నం కేసు దారుణంగా పెట్టారన్నారు. అన్యాయంగా ఉన్నవారి పక్షాన పోరాటం చేసేందుకు పిన్నెళ్లి ఈవీఎంలు పగులగొట్టారని, ఎమ్మెల్యే పరిస్థితి బాగుంటే ఎందుకు ఈవీఎంలు పగులగొడతారని ప్రశ్నించారు జగన్. ఈవీఎం కేసులో పిన్నెళ్లికి బెయిల్ వచ్చినా, మరికొన్ని కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే నాలుగుసార్లు గెలిచిన వ్యక్తిని ఇలా ఇబ్బందిపెడాతారా అని జగన్ ప్రశ్నించారు. తప్పుడు కేసుల్లో ఇరికించడం అన్యాయమన్నారు.

ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో మరో రెడ్ బుక్ తో వేధిస్తున్నారన్నారు. దొంగ కేసులు పెడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు జేసీబీలతో బిల్డింగులు కూల్చుతున్నారన్నారు. ఎల్లకాలం ప్రభుత్వం మీదే కాదు. ఎల్లకాలం రోజులు మీవికావు. పాపాలు పండుతాయన్నారు. ప్రజలు బుద్ధి చెబుతున్నారన్నారు. ఇలాగే దాడులు జరిగితే ఇవాళ మీరేసిన ఈ బీజం, చెట్టవుతుందన్నారు. ఈ దాడులు ఆపకుంటే, భవిష్యత్ లో ఇవే రివర్స్ అవుతాయన్నారు. ఇలాంటి దాడులను దగ్గరుండి ప్రోత్సహించొద్దన్నారు. చంద్రబాబును తాను కోరడం లేదని హెచ్చరిస్తున్నానన్నారు.