Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ నేతల వాహనాలపై రాళ్ల దాడులు

ఖమ్మంలో బీఆర్‌ఎస్ నేతల పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావు, పువ్వాడ, నామా, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై రాళ్లు రువ్వారు. అంతకు ముందే బీఆర్‌ఎస్ నేతలు ఖమ్మంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తున్న కారణంగా ఈ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలినట్లు సమాచారం. మూడు కార్లపై ఈ దాడులు జరిగాయని, వాటిలో హరీష్ రావు, సబిత, పువ్వాడ ఉన్నారని పేర్కొన్నారు. కొందరికి గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.