మహబూబాబాద్‌లో రాళ్ల వర్షం.. ఆందోళనలో ప్రజలు!
మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చీకటి పడితే చాలు ఆ కాలనీ ప్రజలంతా రాళ్ల భయంతో హడలెత్తిపోతున్నారు. నలు దిక్కుల నుండి ఇళ్లప రాళ్ళ వర్షం కురుస్తుండతో అక్కడి ప్రజలకు రాత్రంతా భయాందోళనతో కునుకు లేకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంటున్నాయని తెలిపారు. ఇది చూసి తట్టుకోలేక వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వలస వెళ్ళిపోతున్నారు. ఐతే ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తున్నారా.? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఏమీ చేయలేక కాలనీవాసులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.