Breaking NewsHome Page SliderInternationalLifestyleNational

భారీగా ప‌త‌న‌మైన‌ స్టాక్ మార్కెట్లు

ట్రంప్ ధాటికి స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌న‌మౌతున్నాయి. టారిఫ్ వార్, విదేశీ నిధులు తరలిపోవడం, భారీగా అమ్మకాల వల్ల సెన్సెక్స్ 7 నెలల కనిష్టానికి పడిపోయింది.దీంతో ఇన్వెస్టర్లు రూ.7.52 లక్షల కోట్లు నష్టపోయారు.బీ.ఎస్‌.ఈ. సెన్సెక్స్ 1235.08 పాయింట్లు న‌ష్ట‌పోయి 75,838.36 వ‌ద్ద ముగిసింది.నిఫ్టీ 320.10 పాయింట్లు మేర న‌ష్ట‌పోయి 23,024.65 వ‌ద్ద ముగిసింది. గత జూన్ తరువాత ఇంతలా నష్టపోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన రోజే టారిఫ్ లు భారీగా విధిస్తానని ప్రకటించడంతో డొమెస్టిక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ​​వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి విలువ పడిపోతూనే ఉండటం, మూడో క్వార్టర్ రిజల్ట్స్ నిరాశపర్చడం వల్ల ఎఫ్ఐలు మరిన్ని ఈక్విటీలను అమ్మే అవకాశం ఉందని చెప్పారు.సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా జొమాటో 10.92 శాతం నష్టపోయింది. మూడో క్వార్టర్లో దీని లాభం దారుణంగా పడిపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ఐబీ, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడా పతనమయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ మాత్రమే లాభపడ్డాయి.