Home Page SliderNational

లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్ల లాభంతో 77,073కి పెరిగింది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకుని 23,344 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి రూ. 86.55 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : కొటక్ మహీంద్రా బ్యాంక్ (9.15%), బజాజ్ ఫైనాన్స్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.18%), ఎన్టీపీసీ (2.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.96%). టాప్ లూజర్స్: జొమాటో (-3.14%), అదానీ పోర్ట్స్ (-1.23%), టీసీఎస్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.99%), మారుతి (-0.80%).