Home Page SliderNational

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా HDFC ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాల వేళ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో మళ్లీ 82వేల మార్కును అందుకుని 82,072.17 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 163.73 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద స్థిరపడింది.