స్టాక్ మార్కెట్ ఢమాల్.. 11 లక్షల కోట్ల నష్టం
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలతో స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1700లకు పైగా పాయింట్ల నష్టంతో ట్రేడవ్వగా.. నిఫ్టీ 500 పైగా పాయింట్లు కోల్పోయింది. టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. స్టాక్ మార్కెట్ సమయం ముగిసే నాటికి… ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఒక్కరోజే ఇంత మొత్తంలో స్టాక్ మార్కెట్ పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.