Home Page SliderNational

భార్యతో కలిసి క్రికెటర్ అదరగొట్టే  స్టెప్పులు

తన భార్య ధనశ్రీతో కలిసి టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టే స్టెప్పులు వేశారు. శుక్రవారం (డిసెంబర్ 22) వారి 3వవివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీ దానిని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ముంబయ్‌కి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ కూడా అయిన ధనశ్రీ వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్లిన చాహల్ అనంతర కాలంలో ఆమెతో ప్రేమలో పడి, 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒక పంజాబీ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై చాహల్ స్పందించాడు. నిన్ను కలిసిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ ప్రతీ క్షణం అద్భుతంగా జరిగిందని పేర్కొన్నాడు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మైలవ్ అంటూ రిప్లై ఇచ్చాడు.