ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్టే ఇవ్వలేం
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వాదనలను ఈనెల 24న వింటామని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అయితే.. ఎమ్మెల్యేల అనర్హతపై డాక్యుమెంట్స్ పరిశీలన, విచారణ తేదీలను నిర్ణయించాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశించింది. అందుకు తేదీలను నిర్ణయించి స్పీకర్ కు సమర్పించాలని తెలిపింది. నెలరోజుల్లో దీనిపై డెసిషన్ తీసుకోవాలని చెప్పింది. దీనిపై రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్య దర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపైన స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

