ఏపీలో మరో 2 వైసీపీ కార్యాలయాలపై కొనసాగుతోన్న స్టేటస్‌కో
ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత నోటీసులపై ఆ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై విచారణ జరిపిన హైకోర్టు కార్యాలయాల కూల్చివేతపై స్టేటస్ కో విధించింది. కాగా ఈ రోజు ఉండి,నరసరావు పేట వైసీపీ కార్యాలయాల కూల్చివేత నోటీసులపై వైసీపీ నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ రెండు నియోజకవర్గాల్లోని వైసీపీ కార్యాలయాలపై కూడా స్టేటస్ కో విధించింది. దీంతో హైకోర్టు ఇప్పటివరకు 18 వైసీపీ కార్యాలయాలకు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. వీటిపై తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

