వలసదారులపై కొత్త చట్టం..
అమెరికా అక్రమ వలసదారుల అంశం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం భారత్‌కు 200మందికి పైగా వలసదారులను విమానంలో పంపించిన సంగతి తెలిసిందే. భారత వలసదారుల అంశంపై చర్చించేందుకు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నేడు వలసదారులపై కొత్త చట్టం తెచ్చే అంశంపై పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారని సమాచారం.

