‘న్యూట్రల్ స్టార్ అల్లు అర్జున్‌పై రాజ్యహింస’..బీజేపీ
తెలంగాణ ప్రజలు ప్రేమించే న్యూట్రల్ స్టార్ అల్లు అర్జున్‌పై రేవంత్ సర్కార్ రాజ్యహింసకు పాల్పడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ వ్యాఖ్యానించారు. ఆయన అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడిని ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను విశ్వసించే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారని, కానీ దానిపై కాంగ్రెస్ తర్క విరుద్ధమైన కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలది ఎమర్జెన్సీ తరహా ఆలోచనలని, గతంలో కూడా మద్రు సుల్తాన్ పూరిని నెహ్రూ, కిషోర్ కుమార్ పాటలను ఇందిరాగాంధీ నిషేధించారని గుర్తు చేశారు.

