Home Page SliderTelangana

కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం-రేవంత్ రెడ్డి

Share with

వచ్చే ఎన్నికల తర్వాత కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం దక్కబోతోందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించారు. నామినేషన్ వేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చేసి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, కొడంగల్ లో ఎమ్మెల్యే ఒకరే ఉంటే… కృష్ణా జలాలు వస్తాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయన్నారు. కొడంగల్ బిడ్డలే రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. కీలక సమయంలో ఎన్నికలు వచ్చాయన్నారు. ఐతే దొంగలు సీఎం కాలేరంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి కేసు కొట్టేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించలేదని ఆమె అన్నారు. షర్మిల కేవలం కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాదని, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు సంబంధించినదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు చెప్పడం విశేషం. మరోవైపు సీఎం ఎవరన్నది తేల్చేది కాంగ్రెస్ పార్టీ హైకమాండేనన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జగ్గారెడ్డి. తెలంగాణ సీఎం ఎవరన్నది సోనియా, రాహుల్, ఖర్గే నిర్ణయిస్తారన్నారు.