Home Page SliderInternational

ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధరకు స్టార్ పేసర్ స్టార్క్

ఐపీఎల్ వేలంలో నేడు చరిత్ర సృష్టించారు అసీస్ ఆటగాళ్లు. ఐపీఎల్‌లో  ఇంతవరకూ ఇంత ధర పలుకలేదు. ఒకటి రెండూ కాదు ఏకంగా రూ.24.75 కోట్ల రూపాయలకు ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీలు పడి చివరికి కోల్‌కతా దక్కించుకుంది. ఈ సారి వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే భారీ ధరలు పలకడం విశేషం. వరల్డ్ కప్ సాధించిన ఈ టీమ్ ఆటగాళ్లు వేలంలో మొదటి రెండు స్థానాలలోనిలిచారు. కెప్టెన్ కమిన్స్ రూ. 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.