రంజీమ్యాచ్‌లో స్టార్ క్రికెటర్లు..కోహ్లి దూరం
అంతర్జాతీయ క్రికెట్ ఆడిన హేమాహేమీ ఆటగాళ్లు ఈ సారి రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లలో బరిలో దిగారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబయికి ఆడుతుండగా, విరాట్ కోహ్లి మాత్రం మెడనొప్పితో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. రిషబ్ పంత్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సౌరాష్ట్ర నుండి రవీంద్ర జడేజా, పంజాబ్ పక్షాన శుభ్‌మన్ గిల్ బరిలో ఉన్నారు. ముంబయి నుండి రోహిత్‌తో పాటు యశస్వి జైస్వాల్, రహానె, శ్రేయస్ అయ్యర్ కూడా ఆడుతున్నారు.