Home Page SliderInternational

వన్డే ఫార్మాట్ కు స్టార్ క్రికెటర్ గుడ్ బై

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు వన్డే క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 2022లో టీ20లకు గుడ్ బై చెప్పిన ఈ ప్లేయర్ తాజాగా వన్డేలకు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని విధాల ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశాడు. అయితే.. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ రహీమ్ ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాడు.