Home Page SliderNational

స్టార్ బ్యాటర్ స్మృతీ మనసు దోచిన మ్యూజిక్ కంపోజర్

టీమిండియా మహిళల క్రికెట్ జట్టు పేరు వినగానే గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన. తన ఆటతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్మృతి అంటే క్రీడాభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటి స్మృతి మనస్సును ఒక యువ మ్యూజిక్ కంపోజర్ ఆకట్టుకున్నాడు. 29 ఏళ్ల పలాశ్ ముచ్చల్ టీ సిరీస్, జీ మ్యూజిక్‌ల కోసం పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. ‘రిక్షా’ అనే వెబ్‌సిరీస్‌కు, ‘అర్థ్’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ‘ఖేలోం హమ్ జీ జాన్ సే’ అనే చిత్రంలో దీపికా పదుకొనేతో కలిసి నటించాడు కూడా. ఐదేళ్లుగా తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్‌ను తెలియజేశేలా కేక్ కట్ చేస్తూన్న ఫోటోలను షేర్ చేశాడు పలాశ్. దీనికి  స్మతి కూడా స్పందించడంతో వీరి బంధం బయటపడింది. గతంలో కూడా న్యూ స్టూడెంట్ అంటూ స్మృతి పియానో వాయిస్తున్న వీడియోను షేర్ చేశాడు పలాశ్ ముచ్చల్.  ఈ మధ్యనే పెళ్లి గురించి మాట్లాడిన స్మృతి తనను కట్టుకోబోయేవాడు జాగ్రత్తగా చూసుకోవాలని, మంచి మనస్సున్న వాడయి ఉండాలని పేర్కొంది. ఈ జంటకు ఆల్ ది బెస్ట్ చెపుదామా..