Home Page Sliderhome page slider

టెస్ట్ క్రికెట్ కు స్టార్ బ్యాట్స్ మెన్ గుడ్ బై

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు నిరాశ చెందారు. వారం రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని ఫ్యాన్స్ మరిచిపోకముందే తాజాగా విరాట్ కోహ్లి కూడా టెస్టు మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. కొద్దిరోజుల క్రితమే కోహ్లి తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకు చెప్పగా అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు కోరుతూ వచ్చారు. కానీ చివరకు విరాట్ కోహ్లి తన ఫైనల్ డెసిషన్ ను ప్రకటించాడు.