Andhra PradeshBreaking NewsHome Page SliderNewsviral

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట :9 మంది మృతి

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోర విషాదం జరిగింది. ఇక్కడ వేంకటేశ్వర దేవాలయంలో కార్తీక శనివారం ఏకాదశి కారణంగా భక్తులు పోటెత్తారు. దీనితో దర్శనానికి పోటీపడి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. మరికొందరు భక్తులు స్పృహ తప్పి పడిపోయారని అధికారులు పేర్కొన్నారు. దీనితో త్వరితగతిన సహాయక చర్యలు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ తొక్కిసలాట ఘటన కలచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి అందజేశారు. సహాయక చర్యల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు.