గవర్నర్ల వైఖరిపై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ వ్రాసారు. తాము తమిళనాడు గవర్నర్ రవిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టామని, మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇలాగే తీర్మానాలు ప్రవేశపెట్టమని కోరారు. ఈ తీర్మానాలను కేంద్రానికి, రాష్ట్రపతికి పంపుదామన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించట్లేదని, నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాగైతే పాలన అస్తవ్యస్తమవుతుందని, రాష్ట్రప్రభుత్వానికి, గవర్నర్లకు మధ్య సమన్వయం కుదరడం లేదని విమర్శిస్తున్నారు. గవర్నర్లు రాష్ట్రప్రభుత్వాలకు సహకరించడం లేదన్నది ఈ లేఖ సారాంశం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇదే విషయంగా గవర్నర్ తమిళిసై పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

