యాదాద్రి కలెక్టరేట్‌లో కత్తిపోటు సంఘటన
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఆత్మకూరు మండలంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ)గా పనిచేస్తున్న మనోజ్‌పై మండల వ్యవసాయ అధికారిణి (ఏఓ) శిల్ప కత్తితో దాడి.. శుక్రవారం ఏఓ కార్యాలయంలోనే వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. గొడవ తారాస్థాయికి చేరడంతో కోపానికి లోనైన ఏఓ శిల్ప మనోజ్‌పై కత్తితో దాడి చేసింది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిల్పను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు.