జగన్మోహినిగా దర్శనమిచ్చిన శ్రీవారు
కలియుగ వైకుంఠం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో పుట్టిన అమృతాన్ని వారికి పంచే నెపంతో శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చారు. తెలివిగా రాక్షసులను తప్పించి, దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించారు. ఆ ముగ్దమనోహర రూపాన్ని దర్శించడానికి తిరుమలకు భక్తులు పోటెత్తారు.