Andhra PradeshNews

11 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత

మరోసారి తిరుమల శ్రీవారి దర్శనానికి బ్రేక్‌ పడనుంది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయబడతాయి. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా వీఐపీ దర్శానాలను టీటీడీ రద్దు చేసింది. దీనిలో భాగంగా నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.