తిరుమల బ్రేక్ దర్శనానికి గ్రహణం
తిరుమల : మనసర్కార్
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునేవారు, వారి ప్రయాణాన్ని ఒకసారి సరిచూసుకోండి. ఈ నెల 24,25 తారీఖులలో, నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు కాబోతున్నాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్ర గ్రహణాల కారణంగా బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేయబడతాయి.
సూర్యగ్రహణం రోజున అక్టోబరు 25 వతేదీ ఉదయం 8 నుండి రాత్రి 7.30 వరకూ, చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 వరకూ ఆలయ తలుపులు మూసివేస్తారని, గ్రహణాల అనంతరం శుద్ధి చేసిన తర్వాతనే దర్శనాలకు అనుమతిస్తారని టిటిడి తెలియజేసింది. అన్ని ప్రత్యేకదర్శనాలను రద్దు చేసి, కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే అనుమతిస్తారు.