బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్..హీరో తల్లి క్లారిటీ
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ఇటీవల అనురాగ్ బసు దర్శకత్వంలోని ఒక చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. ఈ చిత్రీకరణ సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారిందని గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల కార్తిక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొన్న సంగతి గుర్తు చేస్తున్నారు. ఈ పార్టీలో శ్రీలీల పుష్పలోని కిస్సిక్ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. దీనితో డేటింగ్ వార్తలు ఎక్కువయ్యాయి. హీరో తల్లి మాటలు కూడా ఈ రూమర్స్‌కి బలం చేకూరుస్తున్నాయి. ఐఫా వేడుకలకు కార్తిక్ తల్లి కూడా రావడంతో హోస్ట్‌గా వ్యవహరిస్తున్ననిర్మాత కరణ్ జోహార్ కార్తిక్ తల్లిని మీకు ఎలాంటి కోడలు కావాలంటూ అడిగారు. దీనికి జవాబుగా ఆమె ఒక మంచి డాక్టర్ కోడలు కావాలని పేర్కొన్నారు. దీనితో రూమర్స్ నిజమే అంటూ క్లారిటీ కొచ్చేశారు అభిమానులు. ఎందుకంటే బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. ఈ కథనాలపై నటీనటులిద్దరూ ఎక్కడా స్పందించలేదు.