InternationalNews

ఆసియా కప్ గెలుచుకున్న లంక

అనూహ్య విజయాలకు క్రికెట్ చిరునామాగా నిలుస్తోంది. ఎవరు ఎలా గెలుస్తారు… ఎందుకు గెలుస్తారన్నది కాకుండా విజయాలు సొంతం చేసుకోవడం క్రికెట్‌లో మరీ ముఖ్యంగా పొట్టి క్రికెట్‌లో జరిగుతుంటుంది. వాస్తవానికి ఆసియా కప్ ట్వంటీ 20లో ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ ఆడితే చూసి తరించాలని 200 కోట్ల మంది క్రీడా అభిమానులు భావించారు. మొదట్లో సీరిస్‌లో సత్తా చాటిన భారత్ అనూహ్యంగా పాకిస్తాన్, శ్రీలంకపై ఓడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా ఆడిన లంక జట్టు ఎవరూ ఊహించని విధంగా ఫైనల్స్‌లోకి ప్రవేశించడమే కాదు టోర్నీలో విజయం సాధించి సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 171 టార్గెట్ ఫిక్స్ చేయగా… ఆ జట్టు కేవలం 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్థిక సంక్షోభంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న లంకకు ఆసియా కప్ గెలుపు పెద్ద ఊరటని చెప్పాలి. మరోవైపు సీరిస్‌లో చక్కగా రాణించిన పాకిస్తాన్ జట్టు ఫైనల్లో లంక చేతిలో తలవంచింది.

COURTESY ICC TWITTER ACCOUNT