శ్రీరామనవమి సంఘటనలు హనుమాన్ జయంతికి రిపీట్ కాకూడదు
హనుమాన్ జయంతి సందర్బంగా శాంతి భద్రతలకు భంగం కలుగకుండా చూడాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. శ్రీరామ నవమి వేడుకలలో కొన్ని రాష్ట్రాలలో హింసాత్మక సంఘటనలు, అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీనితో కేంద్ర హోం శాఖ హనుమాన్ జయంతికి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని,సమాజంలో మతసామరస్యానికి విఘాతం కలుగకుండా పర్యవేక్షించాలని రాష్ట్రాలను కోరింది. నవమి ఉత్సవాల్లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టడం, దుకాణాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. దీనితో కోల్‌కతా హైకోర్టు కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.