Home Page SliderInternational

శ్రీలంక ప్రభుత్వం సూపర్ డెసిషన్, మ్యాటరేంటంటే!?

అక్కర్లేదనుకున్న శిశువుల కోసం శ్రీలంక ‘బేబీ బాక్సులు’

శ్రీలంకలో పిల్లలను కని వదిలేసి వెళ్తున్న జంటల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు పిల్లలను పెంచడం భారంగా భావించి వారిని ఎక్కడపడితే అక్కడ వేదిలివేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఓవైపు కరువు, మరోవైపు ఆర్థిక నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు, తమ బిడ్డల్ని కని వదిలేస్తున్నారు. ఇలా బిడ్డలను వదిలేస్తున్న తల్లిదండ్రులు, ఎక్కడపడితే అక్కడ తమ బిడ్డలను వదిలేయకుండా ఉండేందుకు, పిల్లల్ని పెంచడానికి ఇష్టపడిన తల్లిదండ్రుల కోసం, పుట్టిన శిశువులను “బేబీ బాక్స్‌ల్లో” ఉంచేలా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది శ్రీలంక ప్రభుత్వం.

ఇటీవలి ఇలాంటి ఘటనలు 60కి పైగా జరిగాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తల్లిదండ్రులు పిల్లలను వీధుల్లో విడిచిపెడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆరేళ్లలో కనీసం 80 మంది పిల్లలు ఇలా తల్లిదండ్రులు వదిలేశారని, ప్రొబేషన్ & చైల్డ్ కేర్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు “బేబీ బాక్స్‌లు” పరిచయం చేస్తున్నట్టు ప్రొబేషన్ మరియు చైల్డ్ కేర్ సర్వీసెస్ శాఖ కమిషనర్ లియనాగే తెలిపారు. ఐతే, పసికందులను “బేబీ బాక్సుల్లో” ఉంచాలనుకునే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కమిషనర్ స్పష్టం చేశారు. మహిళా, శిశు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి చట్టాలను సవరించేందుకు సిద్ధమవుతోందని ఆమె తెలిపారు.