Home Page SliderNational

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత కన్నుమూత

శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ బీ.ఎస్.రావు కన్నుమూశారు. కాగా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆయన ఇటీవల బాత్‌రూంలో జారీ కిందపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఆయన చికిత్స పొందుతూ..కొంతసేపటి క్రితమే మృతి చెందారు. ఈ క్రమంలో రేపు బీ.ఎస్. రావు స్వస్థలం విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. బీ.ఎస్.రావు(బొప్పన సత్యనారాయణ) 1986లో బెజవాడలో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. ఈ విధంగా ఆయన అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుతం 321 కాలేజీలు,322 టెక్నో స్కూల్స్ ,107 CBSE స్కూళ్లు ఉన్నాయి.  కాగా ఈ సంస్థల్లో సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం.