శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం నెలకొంది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియేట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గరున్న శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో MPC ఫస్ట్ ఇయర్ చదువుతున్న కౌశిక్ రాఘవ (17) ఈ రోజు ఉదయం హాస్టల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని రాఘవ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. విద్యార్థి తల్లిదండ్రులు కొడుకు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.