ఈ రోజు IPL మ్యాచ్‌లో SRH ఓడిపోవాలి
ఈ IPL సీజన్ త్వరలోనే ముగింపు దశకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో తమ హోమ్ టీమ్ SRH ఓడిపోవాలని SRH ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదేంటి IPL సీజన్ చివరి దశలో SRH ఫ్యాన్స్ ఇలా కోరుకుంటున్నారని ఆశ్చర్యపోతున్నారు కదూ. అయితే SRH ఫ్యాన్స్ ఇలా కోరుకోవడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో SRH పై గెలిస్తేనే డుప్లిసెస్ సేన ప్లేఆఫ్స్ ఆశయాలు సజీవంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో SRH ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయిందని..ఇవాళ ఓడిపోయినంత మాత్రాన పోయేదేమి లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు SRH ఓడిపోవాలని కోహ్లీ ఫ్యాన్స్,SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.