హాస్పిటల్ నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్
పుష్ప-2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో శ్రీతేజ్ చికిత్స పొందనున్నాడు. హాస్పిటల్ నుండి రీహాబిలిటేషన్ సెంటర్‌కు శ్రీతేజ్‌ను కుటుంబసభ్యులు తరలించారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇంకా తమను గుర్తు పట్టడం లేదని తండ్రి భాస్కర్ తెలిపారు.


 
							 
							