Home Page SliderInternationalmovies

పెళ్లి చేసుకోబోతున్న ‘స్పైడర్‌మ్యాన్’ జంట

హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ‘స్పైడర్‌మ్యాన్’ ఫ్రాంచైజీలోని 3 సినిమాలలో కలిసి నటించిన హాలీవుడ్ స్టార్లు వివాహం చేసుకోబోతున్నారు. ఈ చిత్రాలలో జంటగా నటించిన హీరో హీరోయిన్లు టామ్ హాలండ్, జెండయాలు త్వరలో వివాహం చేసుకుంటారని సమాచారం. ఇప్పటికే వారి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు మీడియా ప్రకటించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈవెంట్‌లో జెండయా డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఫ్యాన్స్ వీరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. వీరిద్దరూ 2021 నుండి డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.