తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి
* కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
*సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు. దీంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.

