కర్ణాటక సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై చర్చలు వేడెక్కుతున్న నేపథ్యంలో, సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌ను కలవాలనే యోచనలో ఉన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ ఆయనతో భేటీకి నిరాకరించినట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల ప్రకారం, ఢిల్లీలో సమావేశం అవసరం లేదని, అదే ఆదేశాలు ఇతర నేతలకూ వర్తిస్తాయని హైకమాండ్ స్పష్టంగా తెలిపిందట. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అపాయింట్మెంట్లు అడగవద్దని సూచించినట్లు సమాచారం.
దీంతో, సిద్దరామయ్య ఈ ఢిల్లీ పర్యటనలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికే పరిమితం కానున్నారని వర్గాలు చెబుతున్నాయి. సీఎం మార్పుపై పార్టీ అంతర్గత చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హైకమాండ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

