Home Page SliderTelangana

అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు..కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బుద్వేల్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. ఆ స్కూల్లో ఒక కీచక ఉపాధ్యాయుడు అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు చెప్తానంటూ స్కూల్ సమయం ముగిసిపోయిన తర్వాత విద్యార్థినులను క్లాస్‌రూమ్‌లోకి పిలిపించి లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. అక్కడ కొన్నేళ్లుగా పని చేస్తున్న ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ దురాగతాలు విద్యార్థినులు మహిళా టీచర్లకు తెలియజేశారు. వారు ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ఈ విషయం తమ తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వారు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తూ, పోలీసు కంప్లైట్లు ఇచ్చారు. దీనితో విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.