రౌడీ మూకలపై ప్రత్యేక దృష్టి సారించాలి
రౌడీ మూకల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీరికి సంబంధించిన కేసుల్లో త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు.
ఎంవిపి కాలనీ: రౌడీ మూకల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీరికి సంబంధించిన కేసుల్లో త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. పోలీసు సమావేశ మందిరంలో ఆయన విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ, నగర పోలీసు కమిషనర్ రవిశంకర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్‌పీలతో సమావేశమయ్యారు. డీజీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాలు, రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యం కలిగిన కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.


 
							 
							