తిరుమల గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు..400 బస్సులు
కలియుగ వైకుంఠం తిరుమలలో గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలియజేశారు. ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గరుడసేవ చాలా ప్రత్యేకమైనది. శ్రీవారికి ఇష్టమైన ఈ గరుడ సేవకు భక్తులు దేశం నలుమూలల నుండి పోటెత్తుతారు. అందుకే ఈ గరుడసేవకు ఏపీఎస్‌ఆర్టీసీ 400కి పైగా బస్సులు ఏర్పాటు చేసింది. 3 వేల ట్రిప్పులు నడిపడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల భద్రత కోసం 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు. పోలీసులు 3,800 మంది విధుల్లో ఉంటారు. తిరుమల మాడవీధులలో భక్తులకు ఇబ్బంది లేకుండా సంతృప్తిగా గరుడసేవ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడ సేవకు 3.50 లక్షలమంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు.

