పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు సాయిని కొట్టిన CI అంజూ యాదవ్‌పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎస్పీ పరమేశ్వర రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. CI పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మా సమాధానంతో పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందారన్నారు. అయితే సీఎం దిష్టి బొమ్మ దహనం సమయంలో గలాటా జరిగిందన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ చార్జ్ మెమో ఇవ్వలేదన్నారు. కాబట్టి హెచ్‌ఆర్‌సీ రిపోర్టులకు సమాధానమిస్తామని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.