బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీనే బెస్ట్: కాజల్
కాజల్ అగర్వాల్ దక్షిణాదిలో ఈ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరనే చెప్పాలి. తన అందం,అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను మంత్ర ముగ్దులని చేసి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు కాజల్ అగర్వాల్. ఇలా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె ఈ ఇంటర్వూలో మాట్లాడుతూ..బాలీవుడ్ కంటే నాకు సౌత్ ఇండస్ట్రీలో నటించడమే ఎక్కువ ఇష్టమన్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న నైతిక విలువలు,క్రమశిక్షణ అంటే నాకు చాలా ఇష్టమన్నారు.కాగా బాలీవుడ్‌లో నైతిక విలువలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి అని అన్నారు. సౌత్ ఇండస్ట్రీలో అద్భుతమైన దర్శకులు ,సాంకేతిక నిపుణులు ఉన్నారన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.